ఏపీలో మళ్ళీ రాజ్యసభ రేసు మొదలైంది…త్వరలోనే ఏపీ నుంచి నాలుగు స్థానాలు భర్తీ కానున్నాయి..వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి..బీజేపీ నుంచి సురేష్ ప్రభు, సుజనా చౌదరీ, టీజీ వెంకటేష్ పదవీ విరమణ చేస్తారు. అయితే బీజేపీలో ఉన్న ముగ్గురు..గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే…గతంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఒక రాజ్యసభ ఇవ్వగా, ఆ పదవీ సురేష్ ప్రభుకు దక్కింది..ఇక సుజనా, టీజీలు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఇక తర్వాత వారు బీజేపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే..ఇప్పుడు వారు పదవీకాలం ముగిసింది. అయితే ఈ నాలుగు రాజ్యసభ పదవులు వైసీపీకే దక్కనున్నాయి..దీంతో నాలుగు పదవులని పంచేందుకు జగన్ సిద్ధమయ్యారు. మళ్ళీ విజయసాయికి రాజ్యసభ రెన్యూవల్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ ప్రారిశ్రామికవేత్త అదానీ సతీమణి ప్రీతిని రాజ్యసభకూ పంపించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో అంబానీ రికమండేషన్‌తో పరిమళ్ నత్వానికి రాజ్యసభ ఇచ్చిన విషయం తెలిసిందే..ఇప్పుడు అదానీ భార్యకు రాజ్యసభ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు పదవుల్లో ఒకటి సినీ నటుడు ఆలీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే వైవీ సుబ్బారెడ్డి సైతం రాజ్యసభ పదవి కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఊహించని విధంగా రాజ్యసభ రేసులో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పేర్లు కూడా వచ్చాయి. అయితే వీరు కూడా రాజ్యసభ సీటు కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో మాత్రం క్లారిటీలేదు.

కాకపోతే నెక్స్ట్ ఎలాగో జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారు…అప్పుడు గాని మంత్రి పదవి పోతే ఎమ్మెల్యేగా ఉండటం కంటే రాజ్యసభకు వెళితే గౌరవప్రదంగా ఉంటుందని బొత్స భావిస్తున్నారట…అందుకే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సజ్జల సైతం వైసీపీ తరుపున ఇంకా బలమైన వాయిస్ వినిపించడానికి రాజ్యసభ పదవి ఉంటే బెటర్ అని అనుకుంటున్నారని తెలిసింది.

Discussion about this post