వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న స్థానాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. గిరిజన ప్రాంతంగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ అభిమానులు ఎక్కువే. అందుకే గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు తక్కువ. ఆ పార్టీ గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. 2004లో ఇక్కడ చివరిసారిగా టీడీపీ గెలిచింది. అంతకముందు 1985, 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది.

2009 ఎన్నికల నుంచి సాలూరులో టీడీపీ జెండా ఎగరడం లేదు. 2009లో కాంగ్రెస్ నుంచి రాజన్న దొర గెలిచారు..ఆతర్వాత 2014, 2019 ఎన్నికల్లో కూడా వరుసగా వైసీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది..కానీ రాజన్న పై అలాంటి వ్యతిరేకత పెద్దగా లేదు. ఈయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. అలాగే ఎలనాటి వివాదాల జోలికి వెళ్లారు. అనవసరంగా ప్రతిపక్ష నాయకులని సైతం విమర్శించరు.

ఇప్పటికీ సాలూరులో రాజన్న దొర స్ట్రాంగ్ గానే ఉన్నారు. అయితే మొన్నటివరకు ఇక్కడ టీడీపీ తరుపున ఆర్పీ భాంజ్ దేవ్ పనిచేశారు. ఆయన పనితీరు సరిగ్గా లేకపోవడంతో చంద్రబాబు..ఆయనని పక్కన పెట్టేసారు. గుమ్మడి సంధ్యారాణిని ఇంచార్జ్ గా పెట్టారు.

సంధ్యారాణి ఇంచార్జ్‌గా వచ్చాక ..ఇక్కడ టీడీపీ యాక్టివ్ అయింది. కాస్త ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో టీడీపీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. ఇక్కడ వైసీపీ అభిమానులు ఎక్కువ ఉండటం వల్ల టీడీపీకి ఛాన్స్ దొరకడం లేదు. అయితే రాష్ట్రంలో టీడీపీ గాలి బాగా వీస్తే సాలూరులో ఏమన్నా ఛాన్స్ ఉంటుంది..లేదంటే కష్టమే.

Leave feedback about this