కర్నూలు ఎంపీ సీటు టీడీపీకి ఎంతోకాలం నుంచి అందని ద్రాక్షగా ఉన్న సీటు..ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. మొదటలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ డామినేషన్ ఉంది. ఎప్పుడో 1984లో ఒకసారి..మళ్ళీ 1999 ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కర్నూలు ఎంపీ సీటుని టిడిపి గెలుచుకుంది. ఇక 2014 ఎన్నికల్లో గెలుపు దగ్గరకు వచ్చి 44 వేల ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది. అప్పుడు వైసీపీ నుంచి బుట్టా రేణుకా గెలిచారు.
అయితే వైసీపీ నుంచి గెలిచిన ఆమె…తర్వాత టిడిపిలోకి వచ్చారు. అలా కర్నూలు ఎంపీ సీటుపై టిడిపి పట్టు సాధించాలని చూసింది..కానీ కుదరలేదు. అక్కడ వైసీపీ హవానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ దాదాపు లక్షా 48 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచింది. వైసీపీ నుంచి సంజీవ్ కుమార్ గెలిచారు. టిడిపి నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో కోట్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సత్తా చాటిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ సీన్ మారుతుంది..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..ఎంపీ గా ఉంటూ సంజీవ్ కర్నూలుకు చేసేదేమీ లేదు..రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంది కూడా లేదు. దీంతో అక్కడ వైసీపీకి యాంటీ ఉంది. ఇటు టిడిపి నుంచి కోట్ల బలపడుతున్నారు..పార్టీని బలోపేతం చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూతే నెక్స్ట్ కర్నూలు ఎంపీ సీటుని టిడిపి కైవసం చేసుకునేలా ఉంది.
ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో టిడిపి పట్టు సాధిస్తుంది. కర్నూలు పరిధిలో…ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కర్నూలు సిటీ, పత్తికొండ, కోడుమూరు సీట్లు ఉన్నాయి. ఇటీవల సర్వేలో ఎమ్మిగనూరు, కర్నూలు సిటీ మినహా మిగిలిన సీట్లలో టిడిపి గెలవడం ఖాయమని తేలింది. కాస్త కష్టపడితే కర్నూలు కూడా దక్కడం ఖాయం..అంటే ఆరు సీట్లలో టిడిపికి పట్టుంది..దీని బట్టి చూస్తే ఈ సారి కర్నూలు ఎంపీ సీటు టిడిపి ఖాతాలో పడేలా ఉంది.
