రాష్ట్రంలో ఉన్న అన్నీ సమస్యలని ఏకకాలంలో పక్కదారి పట్టించడానికి అధికార వైసీపీ బాగానే ప్రయత్నించిందని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. డ్రగ్స్, గంజాయి అంశంలో పట్టాభి, జగన్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాస్త ఘాటుగానే పట్టాభి మాట్లాడారు. కానీ బూతులు మాట్లాడలేదు. వైసీపీ నేతలు చంద్రబాబుని తిట్టిన బూతుల కంటే..పట్టాభి మాట్లాడింది చాలా తక్కువే.

కానీ ఇదే అదనుగా చూసుకుని వైసీపీ శ్రేణులు పట్టాభి, టిడిపి ఆఫీసులపై దాడులు చేశాయి. ఇక దాడులు ఎలా చేశారనేది ప్రజల మొత్తం చూశారు. కానీ దాన్ని కూడా వైసీపీ అనుకూల మీడియా మార్చే ప్రయత్నం చేసింది. వైసీపీ నేతలు ఎప్పుడు బూతులు మాట్లాడనట్లు చెప్పుకోస్తూనే, పట్టాభి బూతులకు వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు తెలియజేయడానికి టిడిపి ఆఫీసులకు వచ్చారట.

ఈ క్రమంలోనే టిడిపి కేంద్ర కార్యలయంలో ఉన్న కొందరు టిడిపి కార్యకర్తలు….కావాలనే ఆఫీసుని ధ్వంసం చేసేసి, వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగి, ఒక వైసీపీ అసాక్షి మీడియా విలేఖరిని సైతం గాయపర్చారట. పైగా చంద్రబాబు, పట్టాభి ఒక స్క్రిప్ట్ ప్రకారం చేశారని చెబుతూ, ఆ మీడియా పెద్ద స్క్రిప్ట్ రాసిందని టిడిపి శ్రేణులు అంటున్నాయి. అసలు మీడియాకొచ్చిన వీడియోలు చూస్తే ఎవరు ఎలా దాడి చేస్తున్నారో క్లియర్‌గా అర్ధమవుతుంది. అలాంటిది టిడిపి వాళ్లే…టిడిపి ఆఫీసుపై దాడి చేసేసుకున్నారని కట్టు కథనాలు అల్లేసిందని, ఆ కథనాలని ప్రజలు నమ్మే పరిస్తితి లేదని టిడిపి శ్రేణులు మాట్లాడుతున్నాయి.

ఇక పట్టాభి మాట్లాడిన బూతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు పట్టాభి ఘాటుగా విమర్శలు చేశారు గానీ, బూతులు మాట్లాడలేదు. అసలు వైసీపీ నేతలని మించిన బూతులు ఎవరూ మాట్లాడలేరని, అలాంటప్పుడు చంద్రబాబుని తిట్టినందుకు జగన్ ఎన్ని సార్లు క్షమాపణ చెప్పాలో ఒకసారి ఆలోచిస్తే బెటర్ అని అంటున్నారు. ఏదేమైనా అధికార వైసీపీ…తన అధికారాన్ని పూర్తిగా వాడుకుంటుంది.

Discussion about this post