రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల సీట్ల కోసం పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ముందు వరుసలో ఉంది. కోడెల శివప్రసాద్ చనిపోయాక ఈ సీటు విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఓ వైపు కోడెల శివరాం, మరోవైపు వైవీ ఆంజనేయులు..ఇంకా కొంతమంది నేతలు సత్తెనపల్లి సీటు కోసం కొట్టుకుంటున్నారు.


అయితే కోడెల వారసుడుకు సీటు ఇస్తీ..సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు. అటు కోడెల వర్గం కూడా మరొకరికి సీటు దక్కనిచ్చేలా లేదు. దీని వల్ల సత్తెనపల్లిలో టీడీపీ బలపడటం లేదు. అక్కడ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద పాజిటివ్ లేదు. కానీ టీడీపీ సొంత పోరు వల్ల అంబటికి కలిసొస్తుంది. ఇక ఇదే సమయంలో ఇక్కడ జనసేన బలం పెరుగుతుంది. కానీ ఆ పార్టీకి గెలిచే బలం లేదు.

కాకపోతే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఇక్కడ అంబటికి చెక్ పెట్టడం ఈజీ. గత ఎన్నికల్లో అంబటి టీడీపీపై 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ జనసేనకు 10 వేల ఓట్లు వరకు పడ్డాయి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు ఓట్లు వేయడం వల్ల ఉపయోగం ఉండదని, ఈ సరికి తనకు మద్ధతు తెలపాలని అంబటి కోరడంతో కొంతమేర జనసేన శ్రేణులు వైసీపీకి ఓట్లు వేశాయి. దీంతో అంబటి గెలిచారు. కానీ గెలిచాక అంబటి ఏ విధంగా పవన్‌ని టార్గెట్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

దీంతో అంబటిపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి..ఆయన్ని ఖచ్చితంగా ఓడించాలని చూస్తున్నాయి. తాజాగా సత్తెనపల్లిలో పవన్ సభకు భారీగానే జనం వచ్చారు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే సత్తెనపల్లి సీటు జనసేనకు ఇస్తే టీడీపీలో పోరుకు చెక్ పెట్టినట్లు అవుతుంది. మరి పొత్తు సెట్ అవ్వడం, సీటు వదలడం జరుగుతుందో లేదో చూడాలి.

Leave feedback about this