వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం ఇబ్బందిగా మారిపోయింది. అసలే జగన్ వై నాట్ 175 అంటూ ముందుకెళుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే కనీసం అధికారంలోకి రావాల్సిన సీట్లు గెలిస్తే చాలు అనే పరిస్తితి. ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటమి దిశగా వెళుతున్నారు. అందులో మంత్రులు కూడా ఎక్కువగానే ఉన్నారు. పైగా సొంత పార్టీ నేతలే కొందరు ఎమ్మెల్యేలనిఓ వ్యతిరేకించే పరిస్తితి.

అలా సత్తెనపల్లెలో పరిస్తితి ఉంది. ఇక్కడున్న మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది. మంత్రిగా ఉన్నా సరే నియోజకవర్గానికి చేసేదేమీ లేదు. పైగా అక్రమాలు ఎక్కువయ్యాయని సొంత పార్టీ నేతలే విమర్శలు చేసే పరిస్తితి.తాజాగా సత్తెనపల్లెకి చెందిన వైసీపీ నేత చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి…అంబటి టార్గెట్ గా విరుచుకుపడ్డారు. మైకులో నాలుగు మాటలు మాట్లాడితే, పది మంది పోలీసులను వెంటేసుకుని తిరిగితే పెద్ద నాయకుడేం కాదని అంబటిని ఉద్దేశించి ఫైర్ అయ్యారు.

సత్తెనపల్లి అనాథ బిడ్డ కాదని, ఎవరెవరో వచ్చి సంపాదించుకు వెళ్తున్నారని అంబటిపై ఆరోపణలు చేశారు. బయట వ్యక్తుల పెత్తనాన్ని నియోజకవర్గంలో సహించేది లేదని, ఇక 2024 ఎన్నికల్లో తాను అసెంబ్లీ టికెట్ కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తానని భాస్కర్ రెడ్డి అన్నారు. అయితే టికెట్ కోసం ఎవరైనా ట్రై చేయవచ్చని, జగన్ ఎవరికి సీటు ఇస్తే వారే పోటీ చేస్తారని అంబటి చెప్పుకొచ్చారు.
అయితే ఎంత కాదు అనుకున్న ఇక్కడ అంబటిపై ప్రజల్లోనే కాదు..సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ సీటు ఇస్తే ఆయన గెలవడం కష్టమని సొంత పార్టీ వాళ్లే మాట్లాడే పరిస్తితి. ఇక ఇక్కడ టిడిపి లో కూడా గ్రూపులు ఉన్నాయి. సీటు కోసం నలుగురైదుగురు నేతలు ట్రై చేస్తున్నారు.కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే ఇక్కడ డౌట్ లేకుండా టిడిపి గెలుస్తుంది..ఏదేమైనా అంబటి మాత్రం సత్తెనపల్లె నుంచి అవుట్.
