నేడు టీడీపీ అధినేత చంద్రబాబు 73వ పుట్టిన రోజు. సాధారణంగా ఈ దేశంలో ఎంతో మంది నాయకులు జన్మించారు. ఎన్నో రాష్ట్రాల ను ఏలారు. కానీ, చంద్రబాబు తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను కానీ.. తన జీవితంలో చవిచూసిన సమస్యలను కానీ.. పెద్దగా ఎవరూ ఎదుర్కొన లేదనే చెప్పాలి. అంతేకాదు.. ఆయన సాధించిన విజయాలు.. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఉంచాలనే తపన కూడా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడమే కాదు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని కూడా జాతీయ స్తాయిలో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారు.

ప్రాంతీయపార్టీలు జాతీయస్థాయిలో చక్రం తిప్పుతాయా? అన్న ప్రశ్నను తుడిచేసిన తొలినాయకుడు అన్నగారు ఎఎన్టీఆర్ అయితే.. ఆ తర్వాత.. టీడీపీ పగ్గాలు చేపట్టినచంద్రబాబు అంతకుమించి.. అన్నత రహాలో టీడీపీని జాతీయస్థాయికి తీసుకువె ళ్లడమే కాదు.. రెండు సార్లు ప్రధానులను.. నిర్ణయించేస్థాయికి వెళ్లారు. ఒకసారి రాష్ట్రపతి ఎంపికలోనూ.. ఆయన కీలక భూమిక పోషించారు. ఇక, రాష్ట్రంలో అభివృద్ధి, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు.. వంటి సాహసోపేతంగా తీసుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రకు ఎక్కారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన వేసిన బాట.. అనేక తరాలకు .. ఐటీని అందించింది.

ఇలాంటి విజయాలు చంద్రబాబు జీవితంలో అనేకం ఉన్నాయ. అదేసమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కూడా అంతే ఉన్నాయి. పార్టీ ఓడిపోయిన ప్రతిసారీ.. ఇక, పార్టీ పని అయిపోయిందనే ప్రచారం తెరమీదికి వచ్చింది. అంతేకాదు.. పార్టీనేతలు కూడా ఆయనకు అనేక సందర్భాల్లో దూరమయ్యారు. పార్టీపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ.. తాను ఒక్కడే ఉన్నా.. నాయకులను తయారు చేసుకోవడంలోనూ.. పార్టీని తిరిగి పట్టాలెక్కించడంలోనూ.. చంద్రబాబు చూపిన చొరవ.. పార్టీకి ప్రపంచ దేశాల్లోనూ పేరు తెచ్చింది.

మరీ ముఖ్యంగా ఆయన నాయకత్వం.. పార్టీలో ఎప్పటికీ.. చిరస్మరణీయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. బీసీలకు అండగా ఉంటూ.. బడుగు బలహీన వర్గాలు.. మాకు కూడా ఒక పార్టీ ఉంది. మాకుకూడా ఒక రాజకీయ వేదిక ఉంది.. అని సగర్వగా చెప్పుకొనేలా .. పదవులు ఇవ్వడంలో కానీ.. పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంలో కానీ.. చంద్రబాబుచూపిన చొరవ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. నభూతో .. నభవిష్యతి అనే చెప్పాలి. వీటికితోడు.. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబును ఎవరూ వేలు పెట్టి చూపే పరిస్థితి లేకపోవడం.. మరో మెచ్చుకోదగ్గ విషయం.

నాలుగేళ్లు రాజకీయాల్లో ఉంటే.. నలభై రాళ్లు వెనుకేసుకునే నాయకులు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా రాజకీయాలు చేసినా.. చంద్రబాబు ఏనాడూ.. అవినీతి కొమ్మను పట్టుకుని వేలాడిన సందర్భం మనకు కనిపించదు. అందుకే.. ఆయనకు ఎదురైన ఏ సవాలైనా.. దానంతట అది తప్పుకొని.. ఆయనకు దారిచ్చింది.

Discussion about this post