ఏపీ రాజకీయాల్లో మొదటినుంచి ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు తక్కువగానే ఉంటూ వచ్చింది. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టాక ఒకటి రెండు ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో పాగా వేసేది. తెలుగుదేశం పార్టీకి బలమైన సామాజిక వర్గం ఉన్న రిజర్వు నియోజకవర్గాలు వదిలేస్తే…. మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచేది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేయడంతో ఆ వర్గం ఓటర్లు కూడా ముందు నుంచి టీడీపీకి దూరం దూరంగా జరుగుతూ వచ్చారు.

2004 – 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించడం వెనక ఎస్సీ – ఎస్టీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండటం ప్రధానమైన కారణం. ఇక 2019 ఎన్నికల్లో అయితే ఒక్క ప్రకాశం జిల్లా కొండపి లో మాత్రమే టీడీపీ గెలిచింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన గెలిచింది. ఈ రెండు మినహా మిగిలిన అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ తిరుగులేని విజయం సాధించింది.

అయితే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎస్సీ నియోజకవర్గాల్లో పరిస్థితి మారుతోంది. వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. వైసీపీ వ్యతిరేకత ఎదురుకుంటున్న స్థానాలని చూస్తే…రాజాం – పార్వతీపురం – పాయకరావుపేట – అమలాపురం – పి.గన్నవరం – కొవ్వూరు – గోపాలాపురం – పామర్రు – వేమూరు – ప్రత్తిపాడు – సంతనూతలపాడు – గూడూరు – కోడుమూరు – జీడీ నెల్లూరు స్థానాలు ఉన్నాయి.

ఈ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకత ఎదురుకున్నారని క్లీయర్ గా తెలుస్తోంది. రెండున్నర సంవత్సరాలకే ఈ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంటే మరో యేడాది తర్వాత మరికొన్ని రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఫ్యాన్ పూర్తిగా రివర్స్‌లో తిరుగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Discussion about this post