వైసీపీకి ఉన్న అతి పెద్ద కంచుకోట జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఉమ్మడి నెల్లూరులో వైసీపీకి పట్టు ఎక్కువ. ఇక్కడ రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుంది..మెజారిటీ రెడ్డి వర్గం వైసీపీ వైపే మొగ్గు చూపుతుంది. అందుకే అక్కడ వైసీపీ హవా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఆధిక్యం నడిచింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 గెలుచుకోగా, టిడిపి 3 సీట్లు గెలుచుకుంది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. అంటే వైసీపీ డామినేషన్ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చాక నెల్లూరుకు వైసీపీ చేస్తున్నది ఏమి లేదు. పైగా కొందరు నేతల అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలపై విపరీతంగా పన్నుల భారం పెంచడం కూడా వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో బలమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరం కావడం పెద్ద దెబ్బ.ఈ పరిణామాలతో నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగులుతుంది. తాజాగా వచ్చిన సర్వేలో వైసీపీకి ఊహించని ఫలితం ఎదురైంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో టిడిపి 5 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, వైసీపీ 2 సీట్లలో లీడ్ ఉంది. ఇక 3 సీట్లలో టఫ్ ఫైట్ నడుస్తుందని తేలింది.

టిడిపి గెలుపుకు అవకాశాలు ఉన్న సీట్లు..నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరి, కావలి, వెంకటగిరి..వైసీపీ గెలిచే సీట్లు..సర్వేపల్లి, ఆత్మకూరు. ఇక టఫ్ ఫైట్ ఉన్న సీట్లు వచ్చి గూడూరు, సూళ్ళూరుపేట, కోవూరు. అంటే నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగేలా ఉంది.