మొన్నటివరకు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదనే చెప్పాలి…ఉన్నా సరే వైసీపీకి భయపడి నాయకులు బయటకొచ్చి పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు లేవు. ఎవరికి వారు సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఈ మధ్య సీన్ మారింది..అనూహ్యంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ రావడం, టీడీపీ పుంజుకోవడంతో ఎక్కడకక్కడ నేతలు యాక్టివ్ అవుతూ వస్తున్నారు.

ఇదే క్రమంలో ఒకో సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే పరిస్తితి కనిపిస్తోంది. దీని వల్ల నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా ఎక్కువ అవుతుంది. తాజాగా పుంగనూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది..అది కూడా అధినేత చంద్రబాబు ముందే…రాజంపేట పార్లమెంట్ సమీక్షా సమావేశాల్లో భాగంగా..చంద్రబాబు..ఏడు అసెంబ్లీ స్థానాల నేతలతో విడివిడిగా చర్చించారు.

ఇదే క్రమంలో పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి సమావేశం జరుగుతున్న సమయంలో నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ నేత ఎస్కే రమణారెడ్డి వర్గాల మధ్య రచ్చ జరిగింది. బాబు ముందే రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఇదే క్రమంలో చల్లా వర్గం…రమణారెడ్డిని కొట్టినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎవరికి వారు సెపరేట్ గా పనిచేస్తుండటంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.



అటు తంబళ్ళపల్లె నియోజకవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య రగడ నడిచింది..శంకర్ కు టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గం బాబు ముందే నినాదాలు చేసింది. ఇక శంకర్ వర్గం కూడా హడావిడి చేయడంతో తమ్ముళ్ళ మధ్య రచ్చ జరిగింది. అయితే బాబు అక్కడకక్కడే తమ్ముళ్ళకు వార్నింగ్ ఇచ్చేశారు…క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారిపైన అయిన వేటు వేస్తానని అన్నారు.


అందరూ కలిసి పనిచేయాలని సూచించారు…అయితే మొన్నటివరకు పుంగనూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరు..కానీ సడన్ గా దూకుడు పెంచారు..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే తమ్ముళ్ళు యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది…అయితే అందరూ కలిసికట్టుగా ఉంటే వైసీపీకి చెక్ పెట్టడానికి కుదురుతుంది..లేదంటే మళ్ళీ రిస్క్ లో పడ్డట్టే.

Discussion about this post