ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకే కాదు..ఎంపీలపై కూడా ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. అసలు ఎంపీలు రాష్ట్రానికి చేసింది ఏమి కనబడటం లేదు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చేస్తానని 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వాలని జగన్ జనాలని కోరారు. దీంతో జగన్ ఏదో సాధిస్తారని 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ అన్నీ సీట్లు ఇచ్చిన ఫలితం శూన్యం..కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమి లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గళం విప్పేది తక్కువ. ఆ టిడిపి ఎంపీలే ఎక్కువ పోరాడుతున్నారు.
అలా అని వైసీపీ ఎంపీలు తమ పార్లమెంట్ స్థానాల్లో చేసేదేమీ లేదు. ప్రజలకు అండగా నిలిచేది లేదు..అభివృద్ధి చేసేది లేదు..అందుకే వైసీపీ ఎంపీలపై వ్యతిరేకత ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఈ సారి మాత్రం భారీ స్థాయిలో ఎంపీ సీట్లని వైసీపీ ఓడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాగో టిడిపి సిట్టింగ్ సీట్లు శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు పక్కన పెడితే..విజయనగరం, విశాఖ, బాపట్ల, ఒంగోలు, హిందూపురం, అనంతపురం, చిత్తూరు ఎంపీ సీట్లలో వైసీపీకి టిడిపి చెక్ పెట్టేలా ఉంది.

ఇక టిడిపి-జనసేన పొత్తు ఉంటే అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం సీట్లలో వైసీపీకి ఓటమి తప్పదు. టిడిపి గట్టిగా పోరాడితే నరసారావుపేట, కర్నూలు, నెల్లూరు సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సారి వైసీపీకి 5 సీట్లు కూడా వచ్చేలా లేవు.
అరకు, నంద్యాల, తిరుపతి, రాజంపేట, కడప సీట్లలోనే వైసీపీ బలంగా కనిపిస్తుంది. టిడిపి-జనసేన కలిస్తే ఎంపీ సీట్లలో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదనే చెప్పవచ్చు. ఇంకా ఈ సారి ఎన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరు..ఎంపీ సీట్లలో కూడా జనం ఓడించేలా ఉన్నారు