ఏమైందో ఏమో తెలియదు గానీ….మొన్నటివరకు ఏపీ సిఎం జగన్ కోసం కష్టపడిన…ఆయన సోదరి షర్మిల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్‌తో విభేదాల వల్లే షర్మిల ఇలా వేరేగా తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు షర్మిల…విభేదాలు గురించి మాట్లాడకపోయినా, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని అంశంలో మాత్రమే వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు.

ఇటు జగన్ పార్టీకి చెందిన వారు కూడా షర్మిల పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ముఖ్యంగా జగన్‌కు కుడిభుజంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు షర్మిలతో ఎలాంటి సంబంధం లేదని మాట్లాడేశారు. ఇక సజ్జల మాట్లాడిన మాటలపై తాజాగా షర్మిల స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తన అన్న జగన్‌కు, తనకు వంద ఉండొచ్చు అని, కానీ అవి కూర్చొని పరిష్కరించుకోలేనివైతే కావని చెప్పారు.

అలాగే ఒకరు చెబితే పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది కాదని, ఎన్నో ఆలోచించి పార్టీ పెట్టానని చెప్పారు. అయితే సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడారని, కానీ పార్టీ పెట్టాలనే తాను ఫిక్స్ అయ్యానని, కాకపోతే బాధ ఎక్కడ అనిపించిందంటే… తాను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున సంబంధం లేదు అనడం బాధ కలిగించిందని, అదే జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా తన శక్తికి మించి చేశానని షర్మిల చెప్పుకొచ్చారు. అంటే జగన్, షర్మిలల మధ్య విభేదాలు ఉన్నాయని మాత్రం అర్ధమవుతుంది.

ఇక జగన్ సైతం షర్మిల పార్టీ పెట్టడం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే షర్మిలతో సంబంధం లేదని ముందే తేల్చి చెప్పేశారు. మరి వీరి రాజకీయాల్లో నిజమెంత ఉంది…ఒకరికొకరు తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా? అనేది కూడా నమ్మడానికి వీల్లేదని ప్రత్యర్ధులు మాట్లాడుతున్నారు.

Discussion about this post