రెక్కలు చాచుకుని రయ్‌రయ్‌మంటూ విమానాలు దిగే ఎయిర్ పోర్టు కమలం రూపు సంతరించుకుంది. శివ‘మొగ్గ’లో తామర పువ్వు విరిసింది. కన్నడనాడును వచ్చే ఎన్నికల్లో మళ్లీ తన ఖాతాలో వేసుకోవాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ అందుకుతగ్గ ఎత్తులు వేస్తోంది. ఆ రాష్ట్రంలోని మల్నాడు ప్రాంతంలో రూ.వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పై చిత్రంలోని నిర్మాణం.. శివమొగ్గలో రూ.450 కోట్లతో కట్టిన విమానాశ్రయం. బీజేపీ గుర్తు కమలం ఆకృతి వచ్చేలా దీనిని నిర్మించడం ప్రత్యేకత.




