తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం కూడా ఒకటి..ఇక్కడ కేవలం రెండు సార్లు మాత్రమే టిడిపి ఓటమి పాలైంది. 2004, 2019 ఎన్నికల్లోనే ఓడింది. అయితే గత ఎన్నికల్లో దాదాపు 25 వేల ఓట్ల తేడాతో కొవ్వూరులో టిడిపి ఓడింది. వైసీపీ నుంచి తానేటి వనిత గెలిచారు. ప్రస్తుతానికి ఈమె హోమ్ మంత్రిగా ఉన్నారు.
పేరుకు మంత్రిగా ఉన్నారు గాని..ఈమె మంత్రిగా ఉన్నట్లు రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. అంటే ఆమె పెద్దగా హైలైట్ కాలేదనే చెప్పాలి. ఇటు సొంత స్థానంలో కూడా అనుకున్న మేర పనిచేయడంలో కూడా ఆమె సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. దీంతో కొవ్వూరులో వనితపై వ్యతిరేకత కనిపిస్తుంది. తాజాగా వచ్చిన సర్వేలో కూడా అక్కడ వైసీపీ గెలుపుకు అవకాశాలు లేవని తేలింది. అదే సమయంలో టిడిపి గెలుస్తుందని సర్వే చెప్పింది. ఇలాంటి సమయంలో తాజాగా వైసీపీకి షాక్ తగిలింది మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.

2009 ఎన్నికల్లో ఈయన టిడిపి నుంచి కొవ్వూరులో పోటీ చేసి గెలిచారు. 2014లో సీటు దక్కలేదు. కేఎస్ జవహర్ టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో సీటు దక్కుతుందని చూశారు..కానీ అప్పుడు దక్కలేదు..దీంతో ఆయన వైసీపీలోకి వెళ్ళి..వనిత విజయం కోసం కృషి చేశారు. వైసీపీ గెలిచాక రామారావుకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది.
దీంతో రామారావు వైసీపీని వీడారు. ఈయన జనసేనలో చేరతారని ప్రచారం ఉంది. కానీ పొత్తు ఉన్నా కొవ్వూరు సీటు టిడిపికే దక్కుతుంది. మరి అలాంటప్పుడు రామారావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే కొవ్వూరులో టిడిపికి ఎడ్జ్ ఉన్న..గ్రూపు తగాదాలు ఇబ్బందిగా ఉన్నాయి. అవి కూడా తగ్గితే టిడిపికి తిరుగులేదు.
