వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలే కాదు…సొంత పార్టీ నేతలు కూడా శత్రువులుగా మారుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు రాజకీయంగా సొంత పార్టీ నేతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మామూలుగా రాజకీయ శత్రువు టీడీపీనే..కాబట్టి ఆ పార్టీ నేతలతోనే ఎమ్మెల్యేలకు ఫైట్ ఉంటుంది. కానీ రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలతోనే ఫైట్ చేయాల్సిన పరిస్తితి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

అలాగే మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలని డామినేషన్ చేసేలా పనిచేస్తున్నారు. అలా శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ విక్రాంత్ కాస్త హడావిడి చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రిజర్వడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఈయన పెత్తనం పెరిగిందని తెలిసింది. శ్రీకాకుళంలో ఉన్న రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలకు పెద్దగా అధికారం దక్కనివ్వకుండా, మొత్తం విక్రాంత్ ఆధీనంలోనే పెట్టుకుంటున్నారని టాక్.

అయితే ఈ రెండు రిజర్వ్ స్థానాలే…ఇలాంటి స్థానాల్లో ఎమ్మెల్సీ పెత్తనం చెలాయించడంపై ఎమ్మెల్యేల వర్గాలు బాగా గుర్రుగా ఉన్నాయని సమాచారం. ఎలాగైనా విక్రాంత్ డామినేషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం విశేషం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉంది. రాజాంలో జోగులు, పాలకొండలో కళావతిల పరిస్తితి అంత బాగోలేదు. గత రెండు ఎన్నికల్లో వీరు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. అయినా సరే నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి శూన్యం. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ప్రజలకు చేసింది ఏమి లేదని టాక్.


ఇక అధికారాలు మొత్తం విక్రాంత్ చేతులో పెట్టుకోవడంతో జోగులు, కళావతిలకు చేయడానికి ఏం ఉండటం లేదని తెలుస్తోంది. అటు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరిస్తితి కూడా అంత బాగోలేదని తెలుస్తోంది. ఆమె పనితీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఆమెపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి సిక్కోలు ఫ్యాన్‌లో సొంత పోరు ఎక్కువగానే కనిపిస్తోంది.

Discussion about this post