Site icon Neti Telugu

సిక్కోలులో సీనియర్లకు సెగలు..దెబ్బపడుతుందా?

ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. ధర్మాన ప్రసాద్ రావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్. ఈ ముగ్గురు నేతలు శ్రీకాకుళం వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక వీరే విశాఖ రాజధాని కోసం గట్టిగానే గళం విప్పుతున్నారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో ధర్మాన, తమ్మినేని ముందుంటారు.

ఇలా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వీరికి ఇబ్బందికర పరిస్తితులు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ముగ్గురు గెలవడం..వైసీపీ అధికారంలోకి రావడం, మంత్రులు అవ్వడం జరిగింది. మొదట విడతలో ధర్మాన కృష్ణదాస్ మంత్రి అయితే..రెండోవిడతలో ధర్మాన ప్రసాద్ రావు మంత్రి అయ్యారు. ఇక తమ్మినేని స్పీకర్‌గా కొనసాగుతున్నారు. ఇలా కీలక పదవులు దక్కించుకున్న ఈ నేతలకు తమ తమ స్థానాల్లో కాస్త ఇబ్బందికర పరిస్తులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంత మేర వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది. పైగా ఈ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలో దింపాలని చూస్తున్నారు.

కానీ తనయులని పోటీకి దింపే విషయంలో ఇప్పటికే జగన్..సీనియర్లకు షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్తితులోనూ ఎవరి వారసులకు సీటు ఇచ్చేది లేదని, మళ్ళీ సీనియర్ నేతలే తనతో పాటు పోటీ చేయాలని చెప్పేశారు. ఈ విషయాన్ని ధర్మాన ప్రసాదరావు క్లారిటీ గా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెబితే..జగన్ మాత్రం తానే పోటీ చేయాలని చెప్పారని చెప్పుకొచ్చారు.

దీంతో వారసులకు లైన్ క్లియర్ అవ్వలేదని తెలుస్తోంది..ఇక వారసులు బరిలో దిగిన..లేదా ఈ సీనియర్లు బరిలో దిగిన నెక్స్ట్ మాత్రం టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిందే. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే శ్రీకాకుళంలో ధర్మాన ప్రసారావుకు, ఆమదాలవలసలో తమ్మినేనికి రిస్క్ తప్పదు. కొద్దో గొప్పో ధర్మాన కృష్ణదాస్ సేఫ్.  

Exit mobile version