జగన్ ప్రభుత్వం అనూహ్యంగా జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చి…అందరి దృష్టి జిల్లాలపైనే పడేలా చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ పక్క దారి పట్టేలా చేసి జనమంతా జిల్లాల గురించి మాట్లాడేలా చేశారు. అయితే జిల్లాల విభజనపై జనం నుంచి గొప్ప స్పందన ఏమి రావడం లేదు. జిల్లాల విభజన చేసేస్తే వైసీపీకి ఏదో మైలేజ్ పెరుగుతుందని అనుకున్నారు. కానీ ఈ విభజనతో వైసీపీకే రివర్స్ షాకులు తగిలేలా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆందోళన కూడా మొదలైంది. విభజన సరిగ్గా లేదని చెప్పి జనం రోడ్లపైకి వస్తున్నారు..జనమే కాదు సొంత పార్టీ నేతలే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

ఇక మిగిలిన చోట్ల ఆందోళనలు కాకపోయినా, వైసీపీకి వచ్చే బెనిఫిట్ కూడా ఏమి లేదు. కాకపోతే వైసీపీ అనుకూల మీడియా మాత్రం బాగా డప్పు కొట్టేసుకుంటుంది…జిల్లాల విభజన చేసి జగన్ జనం మనసులు గెలుచుకున్నారని కథనాలు వేసేస్తుంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా విషయం తీసుకుంటే…జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం వరకు ఒక జిల్లాగా చేశారు. అంటే 7 స్థానాలతో…ఇదే సమయంలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉండే ఎచ్చెర్లని సైతం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేశారు.

అటు రాజాంని తీసుకొచ్చి విజయనగరం జిల్లాలో, పాలకొండని తీసుకొచ్చి మన్యం జిల్లాలో వేశారు. అంటే ఎచ్చెర్లని ఎప్పటిలాగానే ఉంచేశారు. ఇక దీంట్లో జగన్ ప్రభుత్వం చేసిన గొప్ప ఏంటో ఎవరికి అర్ధం కాని విషయం. ఒకవేళ శ్రీకాకుళం కాకుండా విజయనగరంలో కలిపి ఉంటే జనం నుంచి వ్యతిరేకత వచ్చేదేమో గాని…కాని ఉన్నదాన్ని ఎటు కదపలేదు. మొదట నుంచి ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది..ఇప్పుడు అదే జిల్లాలో ఉంచేశారు. దీంట్లో జనం మనసు గెలుచుకునేది ఏంటో మాత్రం క్లారిటీ లేదు. జిల్లాల విభజనతో ప్రజలకు ఉన్న సమస్యలన్ని తొలగిపోయినట్లు చెప్పుకుంటే పావలా ఉపయోగం ఉండదనే చెప్పాలి.

Discussion about this post