రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండవచ్చు గాని…ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదనే చెప్పాలి. కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని మెజారిటీతో వైసీపీని గెలిపించారని, కానీ ప్రజల అంచనాలని తారుమారు చేసేలా జగన్ పాలన నడుస్తోందని, ఇక ప్రతిపక్ష టిడిపిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, అలాగే పన్నుల భారం పెంచారని, పథకాల్లో కోతలు, అభివృద్ధి లేకపోవడం ఇవన్నీ మైనస్ అవుతున్నా సరే ప్రజలకు తాము చాలా మేలు చేశామని, ఇంకా ప్రజలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళుతుందని, పైగా 175కి 175 సీట్లు గెలుస్తామని చెప్పడం, 30 ఏళ్ళు సిఎంగా ఉంటామని చెప్పడం జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమని అంటున్నారు.

అయితే తాజాగా తనని తాను సింహంతో జగన్ పోల్చుకోవడం మరీ విడ్డూరంగా ఉందని, ప్రతిపక్షాలు తోడేళ్లు మాదిరిగా వస్తున్నాయని, తాను సింహం మాదిరిగా సింగిల్ గా వస్తున్నానని జగన్ చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు-పవన్ పొత్తులో వస్తున్నారనే నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా పొత్తుత్యో భయం లేదని అంటూనే..తాను ఒంటరి వాడినని, తనకు మీడియా లేదని, జనమే సపోర్ట్ అని…ప్రజల్లో సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీడియా లేదని చెబితే ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరు. ఎందుకంటే జగన్ సొంత మీడియా, సపోర్ట్ మీడియా గురించి జనాలకు తెలుసు.

కాబట్టి గత ఎన్నికల మాదిరిగా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం కష్టమే. ప్రతి విషయాన్ని ప్రజలు నమ్ముతారు..పైగా అన్నీ మంచి పనులు చేసినట్లు తనని తాను సింహమని చెప్పుకోవడం ఏంటి అని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. మొత్తానికి జగన్‌ది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు.
