రాష్ట్రంలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో అందరికీ తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మధ్య ఓ పెద్ద వార్ జరుగుతుంది. పూర్తిగా ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే లక్ష్యంతో వైసీపీ మొదట నుంచి పనిచేసుకుంటూ వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చాక….జనాల మీద కంటే ప్రతిపక్ష టిడిపి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టిడిపిపై ఫోకస్ చేసి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసింది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక…రాష్ట్రంలో పరిస్తితి ఏంటి? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రోజురోజుకూ ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి తప్ప, తగ్గేదిలేదని చెబుతున్నారు. అంటే ఇంకా పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు పాలకపక్షం జనంపై ఫోకస్ చేయకుండా ప్రతిపక్షంపై ఫోకస్ చేసి పూర్తిగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుందనే చెప్పాలి. ఇక అధికార నాయకులు ఏ స్థాయిలో ప్రతిపక్ష నేత చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టారో చెప్పాల్సిన పని లేదు.

ఇక అప్పుడు జగన్‌కు బూతులు కనబడకపోవడం విడ్డూరంగానే ఉందని అంటున్నారు. టిడిపి నేత పట్టాభి…సజ్జలని బొసిడికే అని తిట్టారని, కానీ అది జగన్‌ని తిట్టారని భావించి, వైసీపీ శ్రేణులు ఏ స్థాయిలో టిడిపి ఆఫీసులపై, పట్టాభి ఇంటిపై దాడి చేశారో తెలిసిందే అని, కానీ సిఎం హోదాలో ఉన్న జగన్ సైతం, ఆ పదానికి కొత్త అర్ధం చెప్పి మరీ, ప్రజలకు మంచి చేస్తున్న తనని బూతులు తిడుతున్నారని జగన్ మాట్లాడుతూ, ప్రజల దగ్గర నుంచి సింపతీ కొట్టేయాలని చూస్తున్నారని, రాజ్యాంగ అధిపతిని అయినా తననే తిడుతున్నారని మాట్లాడుతున్నారు.

అయితే జగన్‌కు రాజ్యాంగం గురించి కూడా సరిగ్గా అవగాహన లేనట్లు ఉందని, రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి గవర్నర్ అని, ఆ విషయం జగన్‌కు తెలియకపోవడం కాస్త వింతగానే ఉందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అలాగే జగన్…రాజ్యాంగబద్దమైన సీఎం హోదాలో ఉన్నారని, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా రాజ్యాంగబద్దమైన పదవిలోనే ఉన్నారని, అలాంటప్పుడు బాబుని బూతులు తిట్టడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు.

Discussion about this post