అన్నీ బాగున్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు..శింగనమల నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది..అటు ఇంచార్జ్ గా ఉన్న బండారు శ్రావణి దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక టీడీపీ బలపడుతుంది అనుకునే తరుణంలో..టీడీపీలో కొంతమంది నాయకులు శ్రావణికి వ్యతిరేకంగా పనిచేయడం పెద్ద మైనస్ గా మారింది.

గత ఎన్నికల్లో ఊహించని విధంగా శింగనమలలో టీడీపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి దాదాపు 40 వేల ఓట్ల పైనే మెజారిటీతో శ్రావణిపై గెలిచారు. అంత భారీ మెజారిటీతో ఓడిపోయినా సరే శ్రావణి త్వరగానే ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేలా ముందుకెళుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పద్మావతికి అనుకూల పరిస్తితులు కాస్త తగ్గుతున్నాయి.

ఎమ్మెల్యే ఫ్యామిలీ నియోజకవర్గంలో అక్రమాలు, దందాలు ఎక్కువ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ గా మారాయి. ఈ పరిస్తితుల్లో శ్రావణి ప్రజల్లోనే ఉండటం టీడీపీకి ప్లస్. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న కొందరు సీనియర్ నేతలు..శ్రావణిని సైడ్ చేయడానికి చూస్తున్నారని తెలుస్తోంది. శింగనమలలో శ్రావణి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా శ్రావణి..జేసీ వర్గం . దీంతో కొందరు సీనియర్లు శ్రావణికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల శింగనమల టీడీపీలో గ్రూపులు కనిపిస్తున్నాయి.

ఈ గ్రూపు తగాదాలు అలాగే పెరుగుతూ వెళితే చివరికి టీడీపీకే నష్టం జరిగేలా ఉంది. అలా కాకుండా అంతా కలిసి పనిచేస్తే..శింగనమల సీటుని టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Leave feedback about this