వైసీపీ ప్రభుత్వం అవలభించే కొన్ని విధానాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారనే విషయాలని ఎప్పటికప్పుడు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ బయటపెడుతున్న విషయం తెలిసిందే. పిఏసి ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వంలోని లెక్కల్లోని బొక్కలని బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే మద్యం విషయంలో ఎలా అప్పులు తెచ్చారు..కొన్ని వేల కోట్లకు లెక్కలు లేకుండా ఎలా చేశారనే విషయాలని బయటపెట్టారు.

తాజాగా అదానీ సంస్థల నుంచి జగన్ ప్రభుత్వం కొంటున్న సోలార్ విద్యుత్‌లో జరిగిన అక్రమాలని బయటపెట్టే ప్రయత్నం చేశారు. అదానీ సంస్థ నుంచి యూనిట్ వచ్చి రూ.2.49 పైసలకు కొంటున్నారు. కానీ దీని కంటే తక్కువ ధరకు వేరే రాష్ట్రాలు కొంటున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు కొంటుందని, అది మన రాష్ట్రానికి వచ్చేసరికి యూనిట్‌కు రూ.4.50 పైసలు అవుతుందని, ఇది రైతుల కోసం చేసే స్కీమ్ కాదని, అదానీ కోసం చేసే స్కామ్ అని, ఈ కొనుగోలులో 30 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో తప్పు ఉంటే ప్రభుత్వానికి సారీ కూడా చెబుతా అని కేశవ్ అన్నారు.

కానీ ప్రభుత్వం కూడా కేశవ్ ఆరోపణలే నిజమనేలా వివరణ ఇచ్చింది. ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి స్పందిస్తూ…యూనిట్ ధర రూ.2.49 పైసలు అవుతుందని, కేంద్ర, రాష్ట్ర ట్రాన్స్మిషన్, పంపిణీ చార్జీలు అదనంగా పడతాయని అన్నారు. అంటే ఇక్కడ కేశవ్ చెప్పిందే నిజమవుతుంది. అందుకే దీనిపై కేశవ్… రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. అదానీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై తాను లేవనెత్తిన అభ్యంతరాలను వివరించారు.

ఇక దీనిపై విచారించి…ఒప్పందాలని పరిశీలిస్తామని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తామని ఏపీఈఆర్‌సీ నుంచి స్పందన వచ్చింది. మొత్తానికి సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేశవ్…జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే ఇరికించినట్లు కనిపిస్తోంది.

Discussion about this post