రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉండే పరిస్తితి ఉండదు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా.. రాజకీయాల్లో మారుతుంటాయి. ఒకే మూస విధానాన్ని పట్టుకుని ఎవరూ వేలాడరు. సమయానికి తగిన విధంగా వ్యవహరిం చాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి తగిన విధంగానే ప్రజలను కూడా మార్చుకోవాల్సిన అవసరం .. రాజకీయాల్లో నేతలపై ఉంటుంది. ఈ చిన్న లాజిక్ మిస్సవుతున్న రాష్ట్ర బీజేపీ చీఫ్.. సోము వీర్రాజు పై.. ఇదే పార్టీలోని కమ్మ సామాజిక వర్గం గుర్రుగా ఉందని అంటున్నారు.

ఎందుకంటే.. ఇతర సామాజిక వర్గాల పరిస్థితి వేరు. వారికి ప్రభుత్వం వచ్చినా.. రాకపోయినా.. వారి హక్కు లకు భంగం కలగకుండా.. ఉంటే చాలని అనుకుంటారు. కానీ, కమ్మ సామాజికవర్గంలో ఉన్ననాయకులు మాత్రం పార్టీ ఏదైనా.. అధికారంలో ఉండాలని ఆశిస్తారు. ఇది సహజం కూడా.. వారికి ఉన్న వ్యాపారాలు కావొచ్చు.. ఇతరత్రా వ్యవహారాలు కావొచ్చు. వ్యక్తిగత జీవితం కావొచ్చు ఎలా చూసుకున్నా. కమ్మ వర్గం.. అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. ఇది తప్పు కూడా కాదు.

ఎవరి అవసరాలు వారివి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీని కూడా అధికారంలోకి తీసుకురావాలని.. అంటే.. అధికార పార్టీకి మద్దతుగా తీసుకువస్తే.. తమకు కూడా పనులు జరుగుతాయని.. అదే సమయంలో పార్టీని కూడా బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. బీజేపీలోని కమ్మ వర్గం భావిస్తోంది. అయితే.. సోము వీర్రాజు మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టుగా.. వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తాము.. జనసేనతో ఉన్నామని.. జనసేనతోనే ఉంటామని.. ఆయన చెబుతున్నారు.

ఒకవైపు… బీజేపీతొ ఉన్న జనసేనే.. అధికారంలో లేకపోతే.. ఎన్ని తిప్పలు పడాలో గ్రహించి.. అధికారం లోకి వచ్చేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను అనుసరిస్తోంది. ఎవరు ఏమనుకున్నా.. ఫర్వాలే దని.. టీడీపీతో జట్టుకట్టేందుకు ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేస్తోంది. ఎందుకంటే.. అధికారంలో లేకపోతే.. పార్టీ మనుగడ కూడా కష్టం కాబట్టి. మరి ఈ చిన్న విషయాన్ని మిస్సవుతున్న సోము.. విషయంలో కమ్మ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

“ఆయనకు ఇబ్బంది లేదు. పార్టీనాయకుడిగా.. ఆర్ ఎస్ ఎస్‌వాదిగా ఆయన ఉంటే సరిపోతుంది. కానీ, మేం అలాకాదు. మొన్న కేంద్ర మంత్రుల పర్యటన అంటే.. 10 లక్షల విరాళం ఇచ్చాం. ఇలా ఇవ్వాలంటే.. మేం బాగుండాలి.. మా వ్యాపారాలు బాగుండాలి. ఇవి ఉండాలంటే.. అధికారంలో ఉండాలి. ఈ విషయాలు మరిచిపోతే.. కష్టమే!“ అని గుంటూరుకు చెందిన ఒక కమ్మ నాయకుడు.. వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. కమ్మ వర్గం బీజేపీలో ఉండాలని అంటే.. పొత్తుకు రెడీ కావడమే.. లేకపోతే.. ఈ వర్గమే పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. మరి సోము ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post