ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి ప్రకటించింది. తాజాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆసుపత్రి వెల్లడించింది. ఆయనకు ఎక్మోతో పాటు ఇతర ప్రాణాధార చికిత్సనందిస్తున్నట్లు ఎంజీఎం అధికారికంగా ప్రకటించింది.
వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్సనందిస్తున్నట్లు ప్రకటించిన వైద్యులు.. ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ఎస్పీబీకి కరోనా సోకడంతో ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు.