కంచుకోట శింగనమలలో టీడీపీ లుకలుకలు కొనసాగుతున్నాయి. నేతల ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్తితి దిగజారుతుంది. అసలు శింగనమల టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ పార్టీ ఎక్కువసార్లే గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో కంచుకోటలో టీడీపీ చేతులెత్తేసింది. ఊహించని విధంగా వైసీపీ దాదాపు 46 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బండారు శ్రావణిపై జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మావతి ఎదురు లేకుండా దూసుకెళుతున్నారు. ఇటు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న శ్రావణి సైతం దూకుడుగానే పనిచేస్తూ వచ్చారు. కానీ సడన్‌గా పార్టీలో ఉన్న లుకలుకల వల్ల ఆమె సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో అడ్రెస్ లేకుండా ఉన్నారు. అయితే దీనికి కారణం టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అని తెలుస్తోంది. ఇటీవల అనంతపురం పార్లమెంటరీ కమిటీలని కాల్వ నియమించారు.

అయితే శింగనమల అసెంబ్లీకి వచ్చి శ్రావణి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంలో అగ్రవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని శ్రావణి వర్గం భగ్గుమంటుంది. శ్రావణి…జేసీ ఫ్యామిలీ వర్గం కాబట్టే ఇలా చేశారని నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ విషయం గురించి కాల్వతోనే డైరక్ట్‌గా గొడవ కూడా పెట్టుకున్నారు. వెంటనే ఎస్సీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటు శ్రావణి సైతం…అచ్చెన్నాయుడుని కలిసి పరిస్తితిలను వివరించారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

అందుకే శ్రావణి సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లోనే శింగనమల సీటు కోసం రాజు ట్రై చేశారు…కానీ చంద్రబాబు, శ్రావణికి సీటు ఇచ్చారు. ఇప్పుడు ఆమె సైలెంట్ అవ్వడంతో రాజు సీటు కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో శింగనమల సీటులో పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరి శ్రావణి గానీ ఇంకా యాక్టివ్ కాకపోతే శింగనమలలో రాజకీయం మారిపోయేలా ఉంది.

Discussion about this post