టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ దూకుడు కనబరుస్తున్నారు…ధర్మవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో నిలబడి సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఆ దిశగానే ధర్మవరంలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. అయితే ధర్మవరంలో సత్తా చాటడం అంత సులువా? అంటే కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఉన్నారు. ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు.

కాస్త ప్రజల మద్ధతు కూడా ఎక్కువగానే ఉంది..నిత్యం ప్రజల మధ్యలోనే తిరుగుతారు. మరి అలాంటి నాయకుడుకు చెక్ పెట్టడం పరిటాలకు సాధ్యమేనా అంటే చెప్పలేని పరిస్తితి. అయితే ధర్మవరం బాధ్యతలు వచ్చినప్పుడు శ్రీరామ్ అంత దూకుడుగా పనిచేయలేదు. అటు ఎలాగో రాప్తాడు ఉంది కదా అన్నట్లు ఉండేవారు. కానీ నిదానంగా రెండు సీట్లు ఇంకా ఫిక్స్ అనుకుని శ్రీరామ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాప్తాడు సీటు ఏమో పరిటాల సునీతమ్మకు, ధర్మవరంలో శ్రీరామ్‌కు ఫిక్స్ అయిపోయినట్లే అని ప్రచారం మొదలయ్యాక…శ్రీరామ్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

ఈ మధ్య కూడా బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకుంటారని ప్రచారం మొదలైంది. దీనిపై శ్రీరామ్ గట్టిగానే స్పందించారు. పార్టీలోకి ఎవరైనా రావొచ్చు అని, కానీ ధర్మవరం సీటు తనదే అని సీటు ఇవ్వకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని మాట్లాడారు. దీనిపై టీడీపీ అధిష్టానంకూడా ఎలాంటి అభ్యంతరం చెప్పినట్లు లేదు.

దీంతో అక్కడ నుంచి ధర్మవరంలో నిత్యం ఏదొక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. పోరాటాలు చేస్తున్నారు. ప్రజలని కలుస్తున్నారు. ఇలా ధర్మవరంలో శ్రీరామ్ ముందుకెళుతున్నారు. అయితే కేతిరెడ్డి లాంటి నాయకుడుకు చెక్ పెట్టాలంటే..శ్రీరామ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఎలాగో ధర్మవరం టీడీపీకి కంచుకోటే కాబట్టి త్వరగానే పికప్ అవ్వొచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లోపు శ్రీరామ్ స్ట్రాంగ్ అయితే చాలు..ఇంకా ధర్మవరంలో కేతిరెడ్డికి చెక్ పెట్టే సత్తా వచ్చినట్లే.

Discussion about this post