ధర్మవరం రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి…ఓ వైపు జిల్లాల విభజన అంశంపై రచ్చ జరుగుతుంటే…మరోవైపు పరోక్షంగా టీడీపీ సీటు విషయంలో పోటీ నెలకుంది. సీటు విషయం కాసేపు పక్కనబెడితే…ఇటీవల జిల్లాల విభజనలో భాగంగా హిందూపురం పార్లమెంట్‌ని సెపరేట్‌గా జిల్లాగా చేసిన విషయం తెలిసిందే…అయితే జిల్లా కేంద్రంగా హిందూపురంని కాకుండా పుట్టపర్తిని పెట్టారు. దీనిపై బాలకృష్ణ, టీడీపీ శ్రేణులు, ఇతర పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. హిందూపురంనే కేంద్రంగా పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే హిందూపురం జిల్లాలో ఉన్న ధర్మవరంకు రెవెన్యూ డివిజన్ హోదా రద్దు చేశారు. ఎప్పటినుంచో ఉన్న హోదాని తీసేసి…పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. దీనిపై ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తాజాగా దీక్షకు దిగారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర ఉందని, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీరామ్ ఫైర్ అయ్యారు. తాజాగా ధర్మవరం ఎంఆర్‌ఓ ఆఫీసు దగ్గర దీక్ష చేశారు.

అయితే ఇదే సమయంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. జిల్లాల విభజనని స్వాగతిస్తున్నామని, కానీ ఎంతో చరిత్ర ఉన్న ధర్మవరం సబ్ డివిజన్ తీసివేయడం దారుణమన్నారు. ఇలా ఇద్దరు నేతలు ధర్మవరం రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేశారు.

ఇక ఇక్కడ రెవెన్యూ డివిజన్ అంశమే కాదు..సీటు విషయంలో కూడా ఇద్దరు మధ్య పోటీ నెలకొందనే విషయం తెలిసిందే. ఆ మధ్య ధర్మవరం టీడీపీ సీటు సూరిదే అని ఆయన అనుచరులు కామెంట్ చేయగా, పార్టీలోకి ఎవరు వచ్చినా ధర్మవరం సీటు మాత్రం తనదే అని శ్రీరామ్ కూడా గట్టిగా చెప్పారు. ఇలా ఇద్దరు నేతల మధ్య ధర్మవరం సీటు విషయంలో రగడ నడుస్తోంది.


Discussion about this post