అధికార వైసీపీలో ఎక్కువ వివాదాలతో సహవాసం చేసే నేతలు కాస్త ఎక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. ఈ రెండున్నర ఏళ్లలో పలువురు నేతలు వివాదాలతోనే సావాసం చేశారు. అలా వివాదాల్లో ఎక్కువ ఉన్నవారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు. ఈమె సొంత పార్టీ ఎంపీతోనే రచ్చ పెట్టుకున్నారు. అలాగే పేకాట క్లబ్బులని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదురుకున్నారు. అలాగే రాజధాని అమరావతి రైతులపై పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా పోలీసులని బెదిరించారనే ఆరోపణలు ఎదురుకున్నారు.

ఇక అసెంబ్లీలో జగన్‌కు ఓ రేంజ్‌లో భజన చేసి బాగా హైలైట్ అయ్యారు. ఇలా ప్రతిసారి ఏదొక వివాదంలో చిక్కుకుంటూ వస్తున్న శ్రీదేవి..తాజాగా అంబేడ్కర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ వల్ల దళితులకు రాజ్యాంగ హక్కులు రాలేదని, బాబు జగ్జీవన్ వల్లే అన్నీ హక్కులు సాధ్యమయ్యాయని మాట్లాడారు. దీంతో అంబేడ్కర్ వాదులు…శ్రీదేవిపై ఫైర్ అవుతున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇలా మాట్లాడటం ఏంటని? ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇప్పటికే సొంత నియోజకవర్గంలో శ్రీదేవి తీవ్ర వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్‌ని చూస్తే..శ్రీదేవి ముందు వరుసలో ఉంటారని విశ్లేషణలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో శ్రీదేవి కేవలం జగన్ గాలిలో గెలిచారు. మామూలుగా శ్రీదేవి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ జగన్ వేవ్‌లో అమరావతి ప్రాంతంలోని తాడికొండలో గెలిచేశారు.

గెలిచాక అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరు..ఎక్కువ వివాదాల్లో ఉంటారు. ఓ వైపు రాజధాని ఉద్యమం తీవ్రంగా ఉంది. ఇప్పుడేమో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిస్తితులని బట్టి చూస్తే తాడికొండలో మళ్ళీ శ్రీదేవి గెలవడం కష్టమని చెప్పేయొచ్చు. గెలవడం మాట పక్కనబెడితే నెక్స్ట్ ఈమెకు సీటు దక్కడం కూడా కష్టమే అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీటు కోసం డొక్కా మాణిక్యవరప్రసాద్ ట్రై చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే శ్రీదేవికి సీటు కూడా డౌటే.

Discussion about this post