జగన్ కేబినెట్ 2.0లో కొత్తగా వచ్చిన మంత్రుల్లో ఒకరిద్దరు బాగానే ఉన్నా.. మిగిలిన వారిపై మాత్రం జనాలు మండిపడుతున్నారు. ఒకింత సబ్జెక్ట్ పెంచుకోండి సార్లూ!! అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కార ణం.. మంత్రులు చేస్తున్న కామెంట్లే. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబుకు మంచి వాగ్ధాటి ఉంది. ఆయన ఏ సబ్జెక్టునైనా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన కొన్ని వ్యాఖ్యాలు వ్యంగ్యాస్త్రాలకు దారితీశాయి.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్.. దెబ్బతింది. దీనికి కారణా లు తెలియాల్సి ఉంది. అంతేకాదు… దెబ్బతిన్నదని గుర్తించినప్పటికీ.. అది ఎక్కడ ఎలా దెబ్బతిందనేది ఎవరూ గుర్తించలేదు. దీంతో ఈ విషయం ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య వాగ్యుద్దానికి దారితీసింది. అయితే.. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన మంత్రి అంబటి.. ఏ ప్రాజెక్టుకైనా డయాఫ్రం వాల్ ఉంటుందన్నారు. అంతేకాదు.. శ్రీశైలం, నాగార్జున సాగరం వంటివాటికి కట్టిన డయాఫ్రం వాల్ దెబ్బతినలేదన్నారు.

కానీ, పోలవరం ప్రాజెక్టుకు కట్టి డయాఫ్రం వాల్ మాత్రమే దెబ్బతిందని చెప్పారు. దీనికి కారణం.. చంద్రబా బు అండ్ కో అవినీతే కారణమని తెలిపారు. అయితే.. నిజానికి ఒక్క పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే డయా ఫ్రం వాల్ ఉంది. ఈ విషయాన్ని ఆయన గ్రహించి సరిచేసుకునే సరికి.. ఆయన చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఫలితంగా.. ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇక, మరో మంత్రి.. బూడి ముత్యాలనాయుడు కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ నిధులను ప్రభుత్వాలు వాడుకోవడం తప్పులేదన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే వాడుకున్నారనివ్యాఖ్యలు చేశారు.

కానీ, వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టం మేరకు.. ఈ నిధులను ఎవరూ వినియోగించుకునేందుకు అవకాశం లేదు. గతంలో చంద్రబాబు వాడుకున్నారనేది కూడా తప్పు. ఆయన వాడుకున్నది పంచాయతీ నిధులు కాదు. గ్రాంట్లు మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం తనకు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. కానీ, నేరుగా కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులను మాత్రం వినియోగించుకునేందుకు అవకాశం లేదు. ఈ విషయంలోనూ మంత్రి బూడి తప్పులో కాలేశారు. తర్వాత.. ఆయన సరిచేసుకునే లోపు.. జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. దీంతో ఇప్పుడు మంత్రులూ.. సబ్జెక్ట్ పెంచుకోండి.. అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Discussion about this post