ఏపీ సీఎం జగన్ సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు టీడీపీ టికెట్ ఇస్తున్నారా? కడప జిల్లాలో సునీతని టీడీపీ నుంచి బరిలో దింపుతున్నారా? అంటే అవును సునీతమ్మకు టీడీపీ టికెట్ ఇవ్వాలని చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్రను సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

దీనిపై సజ్జల స్పందిస్తూ.. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పచ్చి అబద్ధాలను వండివార్చిందని, దానిని తీసుకుని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి శిక్ష వేయాలని తీర్మానం చేసేరకంగా చంద్రబాబు మాట్లాడారని సజ్జల ఫైర్ అయ్యారు. అలాగే సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చూస్తున్నారని, వైఎస్ కుటుంబాన్ని ఎలాగోలా చీల్చాలని అనుకుంటున్నారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. నేరాన్ని కుటుంబం మీదే తోసేయాలనేది చంద్రబాబు వ్యూహమని చెప్పుకొచ్చారు.

ఇది సజ్జల వర్షన్…అసలు వివేకా హత్య ఎలా జరిగిందో, ఆ హత్యని గుండెపోటుగా చిత్రీకరించడానికి చూసిందో ఎవరో, అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్, వైసీపీ నేతలు సెంటిమెంట్‌ని ఎలా వాడుకున్నారో, నేరాన్ని టీడీపీపై ఎలా తోసేయాలని చూశారో అందరికీ తెలుసని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా వివేకానందరెడ్డిని తామే చంపామని ఆరోపణలు గుప్పించారని, ఇప్పుడు ఆ హత్యలో తనవారి పాత్ర ఉందని బయటపడగానే సీబీఐని తిట్టడం మొదలు పెట్టించారని చంద్రాబాబు..వైసీపీపై ఫైర్ అయ్యారు.

అయితే సునీతమ్మ టీడీపీ సీటు ఇస్తే ఇంకా తప్పు ఎవరిదో జనాలకు అర్ధమైపోతుందని, కానీ రాజకీయంగా ఇదంతా వైసీపీ ఆడుతున్న గేమ్ అని, అసలు సునీతమ్మ రాజకీయాల్లోకి రావడమే కష్టమని, మళ్ళీ అందులో టీడీపీ సీటు తీసుకుంటుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఏదేమైనా తప్పు చేసి దొరకక…అప్పుడు కూడా తిమ్మిని బొమ్మిని చేయడంలో వైసీపీ వాళ్ళకు మించిన వారు లేరని అంటున్నారు.

Discussion about this post