వైసీపీ అధికారంలోకి రాగానే..త్వరగా ప్రజా వ్యతిరేకతని తెచ్చుకున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ స్థానం నుంచి ఆమె గెలిచారు. రాజధాని ప్రాంత వాసులు టీడీపీకి కాకుండా వైసీపీని గెలిపించారు. అయితే ఆ వెంటనే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం..ఎమ్మెల్యేగా శ్రీదేవి తమ ప్రజలకు అండగా నిలబడకపోవడం, ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం..నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడం..పలు వివాదాల్లో ఉండటంతో..శ్రీదేవికి త్వరగా వ్యతిరేకత వచ్చింది.

ఇప్పుడున్న పరిస్తితులని బట్టి చూసుకుంటే మళ్ళీ ఆమెకు సీటు ఇస్తే గెలవడం అసాధ్యమని సర్వేలు చెబుతున్నాయి. దీంతో జగన్..అక్కడ అదనపు సమన్వయకర్తగా మొదట డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించారు. ఆ తర్వాత డొక్కాని గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా పెట్టారు. దీంతో తాడికొండకు అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్‌ని పెట్టారు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే తాడికొండ సీటు శ్రీదేవికి ఇవ్వరని అర్ధమవుతుంది. కానీ ఎవరికి సీటు ఇచ్చినా సరే తాడికొండలో వైసీపీ గెలుపు అనేది ఈజీ కాదు. ఇక్కడ టీడీపీక్ గెలుపుకు సానుకూల అంశాలు ఉన్నాయి.

కాకపోతే ఇక్కడ టీడీపీ అభ్యర్ధి ఎవరు అనేది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్‌గా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు…అయితే ఈయన్ని బాపట్ల ఎంపీగా పంపిస్తారని టాక్ వస్తుంది. అలా పంపిస్తే ఈ సీటు ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు. కానీ శ్రావణ్ మాత్రం తాడికొండలోనే పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఇలా సీటు విషయంలో కాస్త క్లారిటీ లేకపోవడం వాళ్ళ టీడీపీలో కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఈ సీటు త్వరగా తేల్చేసి..అభ్యర్ధిని ఫిక్స్ చేస్తే టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అవుతుంది.
