తండ్రికి పిల్లలు ఎందరు ఉన్నా.. తండ్రికి తగ్గ తనయులు చాలా చాలా అరుదుగా ఉంటారు. తండ్రి పేరు కు తగినట్టు వ్యవహరించడం.. ఎంచుకున్న రంగంలో అతిపిన్న వయసులోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించడం.. చాలా చాలా అరుదుగానే జరుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ప్రకాశం జిల్లా పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనయుడు.. ఏలూరి దివ్యేష్. యువ పారిశ్రామిక వేత్తగా ఆయన ఖండాంతర ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.

16 ఏళ్ల నూనూగు మీసాల వయసులోనే..
నిజానికి ఏలూరి సాంబశివరావు కూడా అతి పిన్నవయసులోనే రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందారు. నిస్వార్థ సేవకు నిలువెత్తు దర్పణంగా.. ఆయనకు ప్రజలు జై కొట్టారు. తండ్రి బాటలో పయనించిన.. దివ్యే ష్.. దేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను ప్రవేశపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. పదహారేళ్ల పిన్న వయసులోనే అవార్డును సొంతం చేసుకోవడం ఏలూరి తనయుడిగా ఆయన సాధించిన ఘనతేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనను ప్రతి ఒక్కరూ.. నూనూగు మీసాల వయసులోనే అరుదైన ఘనత దక్కించుకున్న పారిశ్రామిక వేత్తగా పేర్కొంటున్నారు.

బిపాసా బసు చేతుల మీదుగా!
వికనెక్ట్ ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఏటా వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు `గ్లోబల్ ఫేమ్` అవార్డ్స్ ను అందిస్తుంది. దీనిలో భాగంగా 2020-2021 సంవత్సరంలో వ్యాపార రంగంలో ఏలూరి దివ్యేష్ ఈ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది ప్రముఖ వ్యాపార దిగ్గజాల సమక్షంలో కోల్‌కతాలోని న్యూటౌన్ రాజర్‌హత్ వేదికగా ప్రముఖ బాలీవుడ్ సినీ హీరోయిన్ బిపాసా బసు చేతుల మీదుగా దివ్యేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

టవల్స్ కు మంత్ర ముగ్ధులు!
దివ్వేష్ తన పద్నాలుగేళ్ళ వయసులోనే టౌలైట్ బ్రాండ్ పేరుతో టవల్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను మార్కెట్ లోకి తీసుకువ చ్చారు. ఈ టవల్స్ కు జనాల నుండి మంచి ఆదరణ లభించింది. బ్యాక్టీరియాను దరిచేరకుండా చేయడం ఈ టవల్స్ ప్రత్యేకత. ఓ పక్క విద్యను అభ్యసిస్తూనే యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగి అత్యంత కీలకమైన అవార్డు దక్కించుకుని పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దివ్యేష్. తండ్రి చాటు బిడ్డగా.. కీర్తి శిఖరాలు అధిరోహించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Discussion about this post