టీడీపీలోకి కన్నా ఫిక్స్..ఆ సీటు నుంచే పోటీ!
మొత్తానికి బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ..టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రానున్నారు. తన అనుచరులతో కలిసి కన్నా..టీడీపీలోకి వస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా…రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి చేరాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పెద్దలు సంప్రదించడంతో..కన్నా బీజేపీలో చేరారు. అలాగే కన్నాకు ఏపీ బిజేపి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అధ్యక్షుడుగా ఉన్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం చేసిన […]