గూడెంలో సైకిల్ జోరు..జనసేనకు ఛాన్స్ ఉందా?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. టిడిపి పెట్టిన 1983 దగ్గర నుంచి జిల్లాలో పార్టీ హవా నడుస్తోంది. ఏదో ఒకటి రెండు స్థానాల్లో మినహా మిగిలిన స్థానాలు టిడిపికి కంచుకోటలు గానే ఉన్నాయి. అలాంటి కంచుకోటల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ఈ స్థానంలో టిడిపి మంచి విజయాలే సాధించింది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పార్టీ సత్తా చాటింది. 2004లో కాంగ్రెస్ గెలవగా, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014లో టీడీపీతో పొత్తులో బిజేపి […]