అవినాష్‌కు సీటు ఫిక్స్..గద్దె హ్యాట్రిక్ ఆపగలరా?
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న విజయవాడ తూర్పు స్థానంలో వైసీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. తాజాగా తూర్పు వైసీపీ శ్రేణులతో జగన్ సమావేశమయ్యారు. అవినాష్‌ని మీ చేతుల్లో పెడుతున్నానని, గెలిపించి తీసుకురావాలని చెప్పి జగన్..తూర్పు వైసీపీ కార్యకర్తలకు సూచించారు. అలాగే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మరొక 30 ఏళ్ళు మనదే అని సూచించారు. అయితే తూర్పు అభ్యర్ధిగా అవినాష్‌ని పెట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది. […]