రంజుగా తుని పోరు..రాజా విజయాలకు దివ్య బ్రేక్?
గతంతో పోలిస్తే తుని నియోజకవర్గం పోరు రంజుగా సాగేలా ఉంది. మూడు ఎన్నికల నుంచి ఇక్కడ వన్ సైడ్ గా పోరు నడుస్తోంది. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో వన్ సైడ్ గా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలుస్తూ వస్తున్నారు. అసలు టీడీపీకి కంచుకోటగా ఉన్న తుని స్థానాన్ని వైసీపీ అడ్డాగా మార్చేస్తూ వస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు తునిలో గెలిచారు. అన్నీ సార్లు గెలవడంతో […]