కన్నాతో సైకిల్‌కు అడ్వాంటేజ్..బాబు ప్లాన్ అదేనా!
మొత్తానికి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. గతంలో తాము వేరు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయంగా విభేదించుకున్నాం తప్ప..వ్యక్తిగతంతో ఎప్పుడు తిట్టుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కన్నా వల్ల గుంటూరులో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ అదే గుంటూరులో రాయపాటి సాంబశివరావు మాత్రం..కన్నా చేరిక వల్ల టిడిపికి ఉపయోగం లేదని, కన్నాని చేర్చుకోవద్దన్న..చేర్చుకున్నారని, తాను ఇంకా చంద్రబాబుని కలవనని రాయపాటి అలకపాన్పు ఎక్కారు. ఇక ఆయన్ని టిడిపి అధిష్టానం […]