హర్షకుమార్ వారసుడు కోసం బాలయోగి వారసుడుకు కొత్త సీటు!
కోనసీమ అంటే దివంగత బాలయోగి పేరు ఎక్కువగా గుర్తొస్తుందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి..ఎస్సీ సామాజికవర్గానికి అండగా నిలబడుతూ..కోనసీమలో తనదైన ముద్రవేసుకుని..లోక్‌సభ తొలి తెలుగు స్పీకర్‌గా సత్తా చాటిన బాలయోగి..అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అమలాపురం ఎంపీగా పలుమార్లు పనిచేసిన బాలయోగి మరణం టిడిపికి తీరని లోటుగా మిగిలింది. అయితే బాలయోగి వారసుడు వచ్చిన హరీష్ తొలి ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు. గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. […]