బండి సంజయ్ వెనకాల మేమున్నాం…
ఢిల్లీ మద్యం కేసుల్లో ఈడి విచారణలు ఎదుర్కొంటున్న ఎమ్మల్స్ కవితను ఉద్దేశించి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించనని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు బండి సంజయే వివరణ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అధికార కేంద్రం కాదని, అది కేవలం సమన్వయ స్థానమేనని పేర్కొన్నారు. వారికి విపరీతమైన బాధ్యతలు ఉంటాయన్నారు. అందువల్ల […]