తెలంగాణలో బాబుతో భయమా..ఎదురుదాడి అందుకేనా?
తెలంగాణలో చంద్రబాబు అలా ఎంట్రీ ఇచ్చారో లేదో..ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు బాబుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు తెలంగాణలో రాజకీయాలు జోలికి బాబు వెళ్ళడం లేదు. కానీ ఈ మధ్య కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా పెట్టాక..అక్కడ పార్టీలో కాస్త ఊపు కనిపించింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని అక్కడ భారీ సభ పెట్టారు. ఆ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఆ సభలో ఎన్టీఆర్ గురించి, గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి పనులు […]