హోమ్ మంత్రికి సొంత పోరు..కొవ్వూరులో రివర్స్!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం అంటే టిడిపికి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడ రెండుసార్లు మినహా..మిగిలిన అన్నీ సార్లు టిడిపి గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వర్గ విభేదాలతో టిడిపి ఓటమి పాలైంది. మాజీ మంత్రి జవహర్‌ని అక్కడ ఉండే కమ్మ వర్గం వ్యతిరేకించింది. దీంతో చంద్రబాబు..జవహర్‌ని తిరువూరులో నిలబెట్టారు. కొవ్వూరులో అనితని తీసుకొచ్చి నిలబెట్టారు. అయినా గెలవలేదు. ఎన్నికలయ్యాక అనిత..తన సొంత స్థానం పాయకరావుపేటకు వెళ్ళిపోయారు. ఇటు కొవ్వూరుకు జవహర్ రావాలని చూస్తున్నారు. […]