కుప్పంలో టీడీపీ తగ్గలేదు..బాబుకు జగన్ మేలు?
రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని, పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లో సభలు పెట్టాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఓ కొత్త జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. అయితే ఈ జీవో అందరికీ వర్తిస్తుందని, వైసీపీకి కూడా ఈ జీవో వర్తిస్తుందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత జగన్..రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. ఇదే సమయంలో కుప్పం పర్యటనకు వెళ్ళిన […]