కుప్పంలో బాబుని ఓడిస్తా..పెద్దిరెడ్డికి కష్టమే.!
గత మూడు రోజులుగా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో బాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడుగడుగున బాబు పర్యటనకు అడ్డుపడ్డారు. చివరికి బాబు పాదయాత్ర ద్వారా కుప్పంలో ఇంటింటికి వెళ్లారు. అయితే జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలని తిరగనివ్వకుండా చేస్తున్నారని, కానీ ఈ జీవో వైసీపీ వాళ్ళకు వర్తించడం లేదని, వైసీపీ నేతలు రోడ్లపై యధేచ్చగా ర్యాలీలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. […]