పెద్దిరెడ్డికే సొంత నేతల షాక్..తేల్చలేకపోతున్నారా?
పైకి టీడీపీ పని అయిపోయిందని, ఆఖరికి చంద్రబాబు కుప్పంలో కూడా గెలవరని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు గాని…లోలోపల మాత్రం నెక్స్ట్ తాము గెలిచి అధికారంలోకి వస్తామా? లేదా? అనే డౌటే వైసీపీ నేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు జగన్..ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడం, పనిచేయని వాళ్ళకు సీట్లు లేదని వార్నింగ్‌లు ఇవ్వడం చేస్తున్నారు. అటు అగ్రనేతలు జిల్లాలకు వెళుతూ..అక్కడ వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుని చల్లార్చేందుకు చూస్తున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో […]