మాచర్లలో హోరాహోరీ..పిన్నెల్లికి టెన్షన్ మొదలైందా?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ మాత్రమే గుర్తొస్తుందనే చెప్పాలి. రాజకీయ కక్షలకు అడ్డాగా మారిన మాచర్ల రాజకీయం గత కొన్నేళ్లుగా పిన్నెల్లికే అనుకూలంగా ఉంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాచర్లలో టిడిపి గెలిచింది. మళ్ళీ టిడిపి అక్కడ గెలవలేదు. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. మధ్యలో వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో..పిన్నెల్లి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. […]