అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అనే చెప్పవచ్చు. అక్కడ టిడిపికి పట్టు ఎక్కువ. కాకపోతే ఈ జిల్లాలో కూడా టిడిపికి పట్టులేని ఒకటి, రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో ముందు వరుసలో ఉండేది మడకశిర ఎందుకో గాని మొదట నుంచి ఇక్కడ టిడిపికి మంచి విజయాలు ఏమి దక్కలేదు. 1985, 1994, 2014 ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి గెలిచింది.
అంటే మడకశిరలో టిడిపి బలం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచేది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్ వేవ్ లో కూడా 13 వేల ఓట్ల మెజారిటీతోనే వైసీపీ నుంచి తిప్పేస్వామి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా తిప్పేస్వామి అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయారు. దీంతో అక్కడ వైసీపీకి కాస్త యాంటీ ఉంది. అయితే ఆ యాంటీని ఉపయోగించుకోవడంలో టిడిపి విఫలమైంది. గ్రూపు తగాదాలు టిడిపిని దెబ్బతీసాయి.

మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఎవరి దారి వారిదే అన్నట్లు ముందుకెళుతున్నారు. కలిసి పనిచేయడం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఒకరు పోటీ చేస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. దీని వల్ల టిడిపికే నష్టం జరిగేలా ఉంది.
అయితే మడకశిరపై టిడిపి అధిష్టానం ఫోకస్ పెట్టి, నేతలని కలిపి..అందరూ కలిసికట్టుగా పనిచేసేలా చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. దీని వల్ల మడకశిరలో టిడిపికి గెలుపు అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. సర్వేల్లో కూడా ఇక్కడ వైసీపీకే ఆధిక్యం చూపిస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది ఈలోపు టిడిపి నేతలు మారితే పర్లేదు..లేదంటే మడకశిర మళ్ళీ పోతుంది.