ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు బాగా హల్చల్ చేస్తుంది. మంత్రిగా ఉన్నప్పుడు కంటే మంత్రి పదవి పోయాకే బాలినేని పేరు వార్తల్లో ఎక్కువ ఉంటుంది. మంత్రిగా ఉన్నప్పుడు…హవాలా చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ ఒక్క అంశమే బాలినేనికి కాస్త ఇబ్బంది అయింది. కానీ మంత్రి పదవి పోయాక..ప్రతి విషయం బాలినేనికి రిస్క్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయనే స్వయంగా రిస్క్ పెంచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

ఇప్పటికే గడప గడపకు వెళుతున్న బాలినేనికి ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. అలాగే బాలినేని సైతం..సహనం కోల్పోయి ఏకంగా ప్రజలనే తిట్టే పరిస్తితి ఉంది. ఇటీవల ఆయన ఓ జనసేన మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. అలాగే అల్లూరుకు చెందిన కవితారెడ్డిని బెదిరిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆమెని ఇళ్ళు ఖాళీ చేయించాలని చెప్పి బాలినేని అనుచర్లు చూస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇలా అన్నీ రకాలుగా బాలినేనికి నెగిటివ్ వస్తుంది. ఈ క్రమంలోనే వీటిపై బాలినేని స్పందిస్తూ…ఇవన్నీ టీడీపీ చేస్తున్న కుట్రలని అన్నారు. అలాగే బాలినేని ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు…టీడీపీ నేతలతో కలిసి తమ పార్టీకి చెందిన ఓ పెద్ద నేత కూడా తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ కుట్రలో వైసీపీ పెద్ద నేత కూడా ఉన్నారని, ఆయన కవితకు టచ్‌లో ఉన్నారని చెప్పారు.

అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నాక..ఇలాంటి మాటల యుద్ధం కామన్. కానీ బాలినేనికి చెక్ పెట్టడానికి సొంత వైసీపీలోనే ఒక నేత పనిచేస్తున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసలు బాలినేనిపై కుట్ర చేస్తున్న ఆ వైసీపీ పెద్ద నేత ఎవరని చర్చించుకుంటున్నారు.

ఇక రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…వైవీ సుబ్బారెడ్డి ఉండొచ్చనే ప్రచారం వస్తుంది. మొదట నుంచి బాలినేని, వైవీ వర్గాలకు పెద్దగా పడదనే సంగతి తెలిసిందే. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు…జిల్లాపై పెత్తనం చేసే విషయంలో వైషమ్యాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలినేని చెప్పిన ఆ పెద్ద నేత వైవీ సుబ్బారెడ్డి అని అంతా మాట్లాడుకునే పరిస్తితి.

Discussion about this post