గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలని సైతం వైసీపీ బద్దలు కొట్టి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనేక రాజకీయ సమీకరణాలు వైసీపీకి కలిసొచ్చాయి…టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ఒక్క ఛాన్స్ అని జగన్ అడగడం…ఇంకా కేంద్రం సపోర్ట్…ఇలా చెప్పుకుంటూ పోతే గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలమైన పరిస్తితులు ఉన్నాయి…దీంతో టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో కూడా వైసీపీ సత్తా చాటింది.

అయితే మూడేళ్లలో సీన్ రివర్స్ అయిన విషయం తెలిసిందే. అనూహ్యంగా మూడేళ్లలోనే వైసీపీపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ పుంజుకోవడం జరిగాయి…కంచుకోటల్లో మళ్ళీ టీడీపీకి పునర్వైభవం వచ్చింది. అలాగే వైసీపీ కంచుకోటల్లో కూడా ఇప్పుడు సీన్ మారుతుంది…వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ప్రజా వ్యతిరేకత టీడీపీకి బాగా కలిసొస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో టీడీపీకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుంటూరు జిల్లాలో వైసీపీకి అనుకూలంగా మంగళగిరి, మాచర్ల, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసారావుపేట స్థానాలు ఉన్నాయని చెప్పొచ్చు. గత రెండు ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. వాస్తవానికి వాటిల్లో నరసారావుపేట టీడీపీకి కంచుకోట…కానీ ఎప్పుడైతే కోడెల శివప్రసాద్..సత్తెనపల్లికి మారిపోయరో..అప్పటినుంచి పేటలో వైసీపీ హవా నడుస్తోంది. పైగా కోడెల చనిపోవడంతో..పేటలో టీడీపీ వర్గాలు ఇంకా ఢీలా పడిపోయాయి. అయితే ఇప్పుడు పేట ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది..అదే సమయంలో టీడీపీ బలం పుంజుకుంటే…నెక్స్ట్ వైసీపీకి చెక్ పెట్టొచ్చు.

అటు మాచర్లలో సైతం అదే పరిస్తితి..కాకపోతే టీడీపీ ఇంకా బలపడాలి. అప్పుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి బలమైన నాయకుడుకు చెక్ పెట్టడం కుదురుతుంది. ఇక బాపట్ల, మంగళగిరి స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువే ఉంది…పైగా ఈ స్థానాల్లో టీడీపీ లీడ్ లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అటు గుంటూరు ఈస్ట్ లో కూడా వైసీపీకి పాజిటివ్ పెద్దగా లేదు…కాస్త కష్టపడితే ఈస్ట్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోగలదు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలని టీడీపీ బద్దలు కొట్టేలా ఉంది.

Discussion about this post