ఏపీలో పొత్తుల విషయంలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని అంతా అనుకున్నారు…కానీ తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలని బట్టి చూస్తే పొత్తులు ఉండవని ఎవరికి వారే పోటీ చేస్తారని అర్ధమవుతుంది. వాస్తవానికి పొత్తుల అంశానికి తెరలేపిందే పవన్ అని చెప్పొచ్చు…ఎందుకంటే ఆయన జనసేన ఆవిర్భావ వేడుకల్లో వైసీపీ వ్యతిరేకత ఓట్లని చీలనివ్వను అని అన్నారు. ఇక ఆ మధ్య ఓ మీటింగ్ లో పొత్తుల విషయంలో మూడు ఆప్షన్ ఇచ్చారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయడం, బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయడం, లేదా జనసేన సింగిల్ గా పోటీ చేయడం అని చెప్పారు. ఇక తాజాగా తనకు ఎవరితోనూ పొత్తు ఉండదని, ప్రజలతోనే పొత్తు ఉంటుందని మాట్లాడారు. అంటే ఇక్కడ పొత్తుల గురించి చర్చ తీసుకొచ్చిందే జనసేన వైపు నుంచే. అయితే టీడీపీ నేతలు అధికారికంగా పొత్తుల గురించి మాట్లాడటం లేదు. ఏదో ఒకసారి చంద్రబాబు…వన్ సైడ్ లవ్ ఉండకూడదని మాట్లాడారు. ఇక తర్వాత నుంచి వార్ వన్ సైడ్ అని అన్నారు…టీడీపీ ఒంటరిగానే పొరాడి సత్తా చాటుతుందనే విధంగా మాట్లాడారు.

అంటే ఇక్కడ టీడీపీ ఇప్పుడే పొత్తుల గురించి చర్చించకూడదని అనుకుంటుంది…ఎన్నికల వరకు బలం పెంచుకుని, అప్పుడు పరిస్తితులని బట్టే పొత్తు పెట్టుకోవాలని అనుకుంటుంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించడం జరిగే పని కాదు…కానీ జనసేన శ్రేణులు అదే డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ మాత్రం ఆ విషయంలో క్లారిటీగా ఉంది. అవసరమైతే ఒంటరి పోరుకే రెడీ అవుతుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తుంది.ఇప్పుడు పవన్ కొత్తగా ఎవరితోనూ పొత్తు ఉండదని చెప్పడం వల్ల..టీడీపీకి పోయేదేమీ లేదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. తాము మొదట నుంచి సోలో ఫైట్ కి సిద్ధమవుతున్నామని, ఒంటరిగానే బరిలో దిగి సత్తా చాటుతామని అంటున్నారు. మరి చూడాలి టీడీపీ ఒంటరిగా సత్తా చాటగలదో లేదో.
Discussion about this post