చిత్తూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీ హవా నడుస్తుంది గాని…ఒకప్పుడు ఈ జిల్లాలో టీడీపీ బలంగా ఉండేది…మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ మంచి మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. అలా టీడీపీ మంచి విజయాలు సాధించిన నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భావించక ఇక్కడ వేరే పార్టీ గెలిచిన సందర్భాలు తక్కువ. 1983లో ఇక్కడ ఇండిపెండెంట్ గెలవగా, 1985, 1989,1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.

2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది…అయితే అయిదుసార్లు టీడీపీ నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో బొజ్జల అనారోగ్యం వల్ల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీకి దిగారు. ఇక ఎలాగో రాష్ట్రం మొత్తం జగన్ గాలి ఉంది కాబట్టి, కాళహస్తిలో టీడీపీ ఓటమి అనివార్యమైంది. భారీ మెజారిటీతో వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలిచారు.

అయితే రెండున్నర ఏళ్ల మధుసూదన్ పనితీరు పట్ల కాళహస్తి ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా? అంటే చెప్పడం కష్టమే. ఈయన రెండున్నర ఏళ్లలో ప్రజల్లో ఎంత ఎక్కువ ఉన్నారో తెలియదు గాని, వివాదాల్లో మాత్రం ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఈయన చేసే రెచ్చ ఏంటో తెలిసిందే. ఎంతసేపు చంద్రబాబుపై కామెంట్లు చేయడం తప్ప…పెద్దగా చేసేది ఏమి లేదు.

అయితే కాళహస్తి ప్రజల్లో ఇప్పటికిప్పుడు మార్పులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. ఎలాగో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి…ప్రజలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి అనేక మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు వైసీపీ పాలనపై ప్రజలు మరింత అసంతృప్తి పెంచుకుంటే ఎమ్మెల్యేకు ఇబ్బంది తప్పదు. అలాగే స్వతహాగా ఎమ్మెల్యేకు నెగిటివ్ మార్కులు పెరిగినా సరే..కాళహస్తిని ఈ సారి టీడీపీ కైవసం చేసుకోవచ్చు. మరి చూడాలి కాళహస్తిలో ఈ సారి ఫైట్ ఎలా ఉంటుందో.
Discussion about this post