ఉమ్మడి అనంతపురం జిల్లా…మొదట నుంచి టీడీపీకి అండగా ఉంటూ వస్తున్న జిల్లా…ఏ ఎన్నికల్లోనైనా జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలే వచ్చాయి…కానీ గత ఎన్నికల్లోనే జగన్ గాలిలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది…ఆఖరికి కంచుకోటల్లో కూడా టీడీపీ చేతులెత్తేసింది. ఊహించని విధంగా జిల్లాలో 2 సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే. హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలిచింది. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది.

అయితే ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పార్టీని పికప్ చేయడానికి నేతలు కష్టపడుతున్నారు. వైసీపీ అధికార బలం ప్రయోగించిన సరే తట్టుకుని నేతలు నిలబడుతున్నారు. మొదట్లో నేతలు కాస్త భయపడ్డారు గాని…ఇప్పుడు జిల్లాలో అందరూ నేతలు యాక్టివ్ గా పనిచేస్తున్నారు…వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో వైసీపీపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసొచ్చే అంశం.ముఖ్యంగా కంచుకోటల్లో టీడీపీ మళ్ళీ గాడిలో పడుతుంది. జిల్లాలో రాప్తాడు, రాయదుర్గం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, కదిరి, మడకశిర లాంటి స్థానాల్లో టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇక కదిరి, రాప్తాడు, తాడిపత్రి లాంటి స్థానాల్లో టీడీపీ లీడ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎలాగో సిటింగ్ సీట్లుగా ఉన్న హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో టీడీపీ జోరు కొనసాగేలా ఉంది.

అయితే శింగనమల, గుంతకల్లు, అనంతపురం అర్బన్, పెనుకొండ, ధర్మవరం స్థానాల్లో టీడీపీ ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొద్దో గొప్పో పెనుకొండ స్థానంలో టీడీపీకి కాస్త ఛాన్స్ కనబడుతుంది..మిగిలిన స్థానాల్లో పార్టీ బలపడాల్సి ఉంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది..ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గట్టిగా కష్టపడితే…లీడ్ లోకి వచ్చేయొచ్చు.అయితే మడకశిరలో ఇంకా టీడీపీ తరుపున నాయకుడు డిసైడ్ అవ్వలేదు…ఈ సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి…మడకశిర సీటు కోసం ట్రై చేస్తున్నారు…మరి వీరిలో సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి. మొత్తానికైతే కంచుకోటల్లో ఈ సారి సైకిల్ సవారీ జరిగేలా ఉంది.
Discussion about this post